అహ్మదాబాద్‌లో భారీగా బంగారం పట్టివేత 1 y ago
అహ్మదాబాద్‌లో గుజరాత్ ఏటీఎస్ పోలీసులు, డీఆర్ఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుమారు 88 కేజీల బంగారు కడ్డీలు, 19.66 కేజీల బంగారు నగలు పట్టుకున్నారు. అదే విధంగా రూ. 1.37 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.